ఒంగోలు: పల్లె పండుగ రోడ్లను త్వరగా పూర్తి చేయండి

55చూసినవారు
ఒంగోలు: పల్లె పండుగ రోడ్లను త్వరగా పూర్తి చేయండి
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పనుల పురోగతిపై శనివారం ఒంగోలులోని కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తుందని, పనులను వేగవంతం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా రహదారుల నిర్మాణ పురోగతిపై ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్