ఒంగోలు మండలంలోని సర్వే రెడ్డి పాలెం గ్రామానికి చెందిన దళిత రైతులు ఒంగోలు నగరంలో ఆదివారం స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారసత్వంగా వస్తున్న దళితులకు సంబంధించిన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి, అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి తమ భూమిని తమకు అప్పగించాలని మీడియా సమావేశంలో వారు కోరారు.