జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్స్ ను ఒంగోలులోని కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆల్బెండజోల్ 400 మి. గ్రా మాత్రలు అన్ని అంగన్వాడీలు, పాఠశాలలకు, కళాశాలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.