ఒంగోలు: కరవది ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

72చూసినవారు
ఒంగోలు: కరవది ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
ఒంగోలు రూరల్ మండలంలోని కరవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అమలవుతున్న అన్ని జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించి సిబ్బందికి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఉద్యోగులు అందరూ సమయపాలన పాటించాలని తెలిపారు. ఫేస్ యాప్ నందు హాజరు నమోదు చేయవలెనని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్