ఒంగోలు: బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

70చూసినవారు
ఒంగోలు: బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. రైజ్ కళాశాల టెక్ బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలులో 5కె రన్ నిర్వహించారు. క్యాన్సర్ పై అవగాహన, మాదకద్రవ్యాల నివారణ కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు తిరిగి మినీ స్టేడియం వద్ద ముగిసింది.

సంబంధిత పోస్ట్