టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. ఒంగోలులోని బృందావనం కళ్యాణమండపంలో గురువారం టిడిపి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండల క్లస్టర్ ఇన్చార్జిలతో, కార్యదర్శిలతో నూతన కమిటీల ఏర్పాటుపై చర్చించారు. మండల, గ్రామ సెక్రటరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.