ఒంగోలులో జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రులు డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సత్య కుమార్ ఘన నివాళి అర్పించారు. అనంతరం మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ టీడీపీకి బీసీలే వెన్నెముకలని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. పూలే సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు.