ఒంగోలు: ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం

65చూసినవారు
ఒంగోలు: ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం
ఒంగోలు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ అన్సరియా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు పూలే దంపతులన్నారు. వారు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

సంబంధిత పోస్ట్