విజయవాడలో ఈనెల 5వ తేదీన జరిగే హైందవ శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి కోరారు. ఒంగోలు నగరంలో శుక్రవారం బిజెపి నాయకులు, హిందూ వాదులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి హిందూ తప్పకుండా శంఖారావం సభకు హాజరు కావాలని కోరారు. హిందూ ఐక్యతను చాటి చెప్పవలసిన అవసరం ఏర్పడిందన్నారు.