అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు కార్పొరేట్లకు కట్టబెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం నిగ్గుతేల్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 ఏళ్లలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారు? ఎంతమంది ఉద్యోగాలు పొందారు? స్థానికులు ఎంతమందికి ఉద్యోగాలు దక్కాయో ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.