నిషేధిత భూముల జాబితా నుండి తొలగించిన భూముల పునః పరిశీలన పటిష్టంగా చేపట్టాలని సిసిఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా? లేదా? పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.