ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుక్రవారం రాత్రి ఒంగోలు నగరంలోని మస్తాన్ దర్గాలో జరిగిన గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాను దర్శించుకుని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలను చేశారు. అనంతరం మత పెద్దలు ఎమ్మెల్యే జనార్ధన్ ను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.