ఒంగోలు: రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
ఒంగోలు: రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ కారు డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్టు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. చిన్న జాగ్రత్తతోనే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్