ఒంగోలు నగరంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజారులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.