రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈనెల 8వ తేదీన రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో అన్ని మండలాల తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో ఆమె గురువారం కలెక్టరేట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఎవరూ అలసత్వంగా పనిచేయవద్దని హెచ్చరించారు.