ఒంగోలులో శక్తి టీం పోలీసుల బృందం శక్తి యాప్ పై శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించి, విద్యార్థినిలు, యువత, మహిళలు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా కళాశాలలు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ ప్రధాన సెంటర్లలో పర్యటిస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. శక్తి యాప్ వలన ప్రమాద సమయంలో పోలీసుల సహకారంతో బయటపడవచ్చని వారు వివరిస్తున్నారు.