జిల్లా వ్యాప్తంగా డ్రోన్ సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు శుక్రవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను డ్రోన్ ఎగరేసి మరి క్షుణ్ణంగా పరిశీలించారు. పేకాట, కోడి పందాలు, బహిరంగంగా మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పోలీసు సిబ్బంది తెలిపారు.