ఒంగోలు: 17లోగా ఉన్నతాధికారులు సమాచారం అందించాలి

75చూసినవారు
ఒంగోలు: 17లోగా ఉన్నతాధికారులు సమాచారం అందించాలి
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 25న జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు శాఖల వారీగా ఉన్నతాధికారులు ఈ నెల 17వ తేదీలోగా సమాచారం అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. జిల్లాలోని పరిస్థితులను బట్టి టాప్‌-5 శాఖలకు సంబంధించిన వివరాలను, ప్రస్తుత సమస్యలు, 3 నెలల్లోగా వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను వెల్లడించాల్సి ఉందన్నారు. అందుకోసం సమగ్ర సమాచారాన్ని తనకు అందించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్