ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒంగోలులోని కలెక్టరేట్ నుండి అవగాహనా ర్యాలీని మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు ఇప్పటికే 30% పూర్తయినట్టుగా ఆమె తెలిపారు. ప్రకాశం జిల్లాను క్యాన్సర్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.