ఒంగోలులో జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో సమస్యలను ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వేసవిలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.