విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్-2 యాప్ ను తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సుగమ్య భారత్ యాత్రను శుక్రవారం ఆ శాఖ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డితో కలిసి జండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. సమాజంలో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.