సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మార్కెట్ లో, దుకాణాల వద్ద ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలు కల్పించాలని తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.