ఒంగోలు: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

52చూసినవారు
ఒంగోలు: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
ఉపాధి హామీ పథకంలో లక్ష్యం మేరకు పని దినాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ పనుల వల్ల కూలీలు రావడం లేదంటూ, ఉపాధి పని దినాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. ఫార్మ్ పాండ్స్ వంటి వ్యవసాయ అనుబంధ ఉపాధి పనులపై ఎంపీడీవోలు దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్