విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి ఉత్తమ సేవలు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని ఓపిఎస్ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల, మండల స్థాయిలో ఉత్తమ ఎగ్జిబిట్లుగా ప్రదర్శించబడిన వాటిని జిల్లా స్థాయికి ఎంపిక చేసి ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు.