కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని వంతెన వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి (వయస్సు సుమారు 40ఏళ్లు) మృతి చెందారు. సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై ఫణిభూషణ్ అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 91211 04779కు తెలియజేయాలని కోరారు. కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు.