ఒంగోలు: బాణాసంచా గోడౌన్ ను తనిఖీ చేసిన మేయర్

71చూసినవారు
ఒంగోలు: బాణాసంచా గోడౌన్ ను తనిఖీ చేసిన మేయర్
బాణాసంచా గోడౌన్ ను ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీపావళి సందర్భంగా ఒంగోలులోని 18వ డివిజన్ కొత్త మామిడిపాలెంలో గల బాణాసంచా గోడౌన్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా టపాసుల విక్రయదారులకు పలు సూచనలు చేశారు. అగ్నిమాపక శాఖ సూచించిన జాగ్రత్తలు పాటించాలన్నారు. దీపావళి సందర్భంగా బాణాసంచాదారులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్