నేటి నుంచి ఓపెన్ ఇంటర్ మూల్యాంకనం

64చూసినవారు
నేటి నుంచి ఓపెన్ ఇంటర్ మూల్యాంకనం
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఒంగోలులోని సెయింట్ థెరిస్సా హై స్కూల్ లో శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. ఐదు రోజుల పాటు మూల్యాంకనం జరగనుందని, మూల్యాంకనానికి మొత్తం 24, 912 జవాబు పత్రాలు వచ్చాయన్నారు. మూల్యాంకన విధులకు నియమితులైన వారందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్