పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనలో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కె. నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సాయంత్రం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లరి మూకల దాడిలో పోలీసులు, మహిళలు గాయపడ్డారని చెప్పారు.