పొగాకు రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొదిలిలో పర్యటించిన ఆయన. మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరను అమలు చేయాలని, కనీసం కేజీకి రూ.280 ఇవ్వాల్సిందిగా సూచించారు. అవసరమైతే పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.