ప్రకాశం జిల్లా వైసీపీ నేతకు నోటీసులు జారీ చేసిన పోలీసులు

67చూసినవారు
ప్రకాశం జిల్లా వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో నమోదైన 5 కేసులకు సంబంధించిన నోటీసులను పోలీసులు అందజేశారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. కాగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన నేపథ్యంలో ఎర్రగొండపాలెంలో 3 కేసులు, దోర్నాల, పెద్దారవీడులో ఒక్కొక్క కేసు లెక్కన నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్