టిడిపి నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో 9 మంది నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 9 మందిని అరెస్టు చేసి గురువారం ఒంగోలులోని మూడవ అదనపు మునిసిప్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. వారికి జడ్జి నవ్యశ్రీ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. 9 మంది నిందితులను ఒంగోలులోని జిల్లా జైలుకు తరలించారు.