ఈ సెట్ జేఎన్టీయూ (అనంతపురం) ఫలితాలను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 1, 085 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1, 026మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 94. 56 శాతం మంది అర్హత సాధించగా, వారిలో బాలికలు 95. 91%, బాలురు 94% మంది ఉన్నారు. రాష్ట్రంలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. డిప్లమా, బిఎస్సి (మాథ్స్) డిగ్రీ అభ్యర్థులు నేరుగా ఇంజనీరింగ్ సెకండియర్ లోకి వెళ్లేందుకు ఈ సెట్ ఉపయోగపడుతుంది.