ఈ నెల 19వ తేదీ నుంచి 25వ వరకు 10వ తరగతి విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు 4, 283 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లను, డిపార్ట్మెంట్ అధికారులను కేటాయించినట్లు వివరించారు.