ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ జిల్లాలోని ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు వన్ టౌన్ లో పని చేస్తున్న ఎస్సై త్యాగరాజును దొనకొండకు ఒంగోలు విఆర్ లో ఉన్న ఎస్సై రమణను ఒంగోలు టూ టౌన్ కు, కొమరోలులో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు నాయక్ ను ఒంగోలు వన్ టౌన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఎస్ఐలు వెంటనే బాధ్యతల స్వీకరించాలన్నారు.