గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఇందిర, ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంకు చెందిన పోలయ్యను 30 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. ప్రస్తుతం పోలయ్య ఒంగోలు యూనియన్ చెస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఓ ఉపాధ్యాయురాలితో సహజీవనం చేస్తూ, తనను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఇందిర ఆరోపించింది. శుక్రవారం బ్యాంక్ వద్ద అతని ఫొటోతో ఫ్లెక్సీ పట్టుకుని ఆమె ఆందోళన చేపట్టింది.