పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. మార్కాపురం 24.4, పెద్దారవీడు 12.4, యర్రగొండపాలెం 7.8, త్రిపురాంతకం 22.0, పుల్లలచెరువు 10.4, కంభం 12.2, అర్ధవీడు 11.8, గిద్దలూరు 1.0, కొమరోలు 0.4, తర్లుపాడు 9.4, మార్కాపురం డివిజన్ మొత్తం 113.0 మి.మీ వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.