పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి మహిళలకు మద్దతుగా కొందరు మహిళలు జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో నల్ల బెలూన్లతో నిరసనకు దిగారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి, అది రాళ్లు, చెప్పులు విసురుకునే స్థాయికి చేరింది. ఈ సంఘటనలో ఒక కానిస్టేబుల్‌కి, ఒక మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు నేతలను చెదరగొట్టారు.