ప్రకాశం జిల్లాలో ఆగస్టు 31న షాకింగ్ ఘటన జరిగింది. పొదిలి ఆర్టీసీ డిపో డ్రైవర్ ఎండీ మస్తాన్ ఫోన్ చూస్తూ బస్సు నడిపాడు. భారీ వర్షంలో డ్రైవర్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కొందరు ప్రయాణికులు ఆ డ్రైవర్ను ఇలా చేయొద్దని వారించారు. అయితే డ్రైవర్ పట్టించుకోలేదు. ఫోన్ కాల్ మాట్లాడుతూ పొదిలి నుంచి ఒంగోలు వరకు బస్సు నడిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.