అమ్మనబ్రోలు: వీడిన వీరయ్య చౌదరి దారుణ హత్య కేసు

79చూసినవారు
అమ్మనబ్రోలు: వీడిన వీరయ్య చౌదరి దారుణ హత్య కేసు
టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హత్య కేసులో 11 మంది నిందితుల గుర్తించగా. 9 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు నిందితులున్నట్టు బుధవారం పోలీసులు తెలిపారు. అమ్మనబ్రోలు గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు ప్రధాన కారణమని తేల్చారు. ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్