చినగంజాం మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న రైలు పట్టాలపై శుక్రవారం ఒక యువకుడి మృతదేహం కనిపించింది. ఈ సంఘటనపై చీరాల జీఆర్పీ సబ్ ఇన్‌స్పెక్టర్ కొండయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆ యువకుడు ప్రమాదవశాత్తూ చనిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.