మార్టూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. పొగాకు పనులకు వచ్చి రోడ్డు దాటుతున్న కె. శ్యామల అనే మహిళను అరటిపళ్ళ లోడ్ తో వెళ్తున్న టాటా ఏస్ వాహనం వేగంగా ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు. వారి సమాచారం మేరకు మార్టూరు పోలీసులు విచారణ చేపట్టారు.