పర్చూరు కు చేరిన అమరావతి రైతుల కృతజ్ఞతాయాత్ర

66చూసినవారు
పర్చూరు కు చేరిన అమరావతి రైతుల కృతజ్ఞతాయాత్ర
నవ్యాంధ్ర రాజధానికి పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న చర్యలపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. దేవ దేవుళ్లకు, న్యాయ దేవుళ్లకు, ఓటరు దేవుళ్లకు వందనాలు అంటూ అమరావతి రైతులు చేపట్టిన కృతజ్ఞతా పాదయాత్ర శనివారం పర్చూరుకు చేరింది. నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి పఠాన్ సమీర్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, శ్రేణులు అమరావతి రైతులకు ఘనంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు.

సంబంధిత పోస్ట్