మనస్థాపంతో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

82చూసినవారు
మనస్థాపంతో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడు గ్రామానికి చెందిన బత్తుల శిరీష భర్త అంకయ్య ఇటీవల మరణించారు. అప్పటి నుంచి తన పిల్లలతో అత్తమామల వద్దే శిరీష ఉంటుంది. కొంతకాలంగా మనస్థాపం చెందిన ఆమె బుదవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్