చీమకుర్తి పట్టణంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం పోషన్ పక్వాడ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సూపర్వైజర్ ప్రమీల మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు, తల్లులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. తక్కువ ధరతో, ఎక్కువ పోషకాలు గల ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు, హెల్త్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.