కౌలు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

60చూసినవారు
కౌలు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
మద్దిపాడు మండలంలోని కౌలు రైతులు కౌలు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు శనివారం తెలియజేశారు. కౌలు కార్డులు వల్ల భూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, కౌలు రైతులకు పంట పండించిన పంట మీద మాత్రమే హక్కు ఉంటుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటకు ఈక్రాప్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ విఏఏల ద్వారా ఈక్రాప్ నమోదుచేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్