పశువులకు టీకాలు వేయించాలి

51చూసినవారు
పశువులకు టీకాలు వేయించాలి
నాగులుప్పలపాడు మండలంలోని ఆవులు, గేదేలలో వచ్చే గొంతు వాపు వ్యాధిపై పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారులు తెలియజేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల పశువులకు జ్వరంతో కూడిన లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పశుపోషకులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్