బడి బయట ఉన్న పిల్లలందరు బడిలో చేరాలని మండల విద్యాశాఖ అధికారి రమణయ్య అన్నారు. శనివారం నాగులుప్పలపాడులోని ఎంఈఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడికి పోతా కార్యక్రమాన్ని తీసుకురావడం వల్ల ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.