చీమకుర్తి మండలం లో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అద్వాన స్థితిలో ఉన్నాయి. చీమకుర్తి నుండి మద్దిపాడు వెళ్లే చిన్న రాస్తా రోడ్డు చిన్న చిన్న వర్షానికి గుంతలు ఏర్పడి కంకర పైకి తేలుతుంది. ఈ రహదారి మీద వెళ్లాలంటే నరకయాతన వేస్తుందనివాహనదారులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులుకు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.