సీఎస్‌పురం మండలంలో 69 మంది వితంతువులకు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. పెన్షన్ తీసుకుంటూ భర్త మరణించిన వారి చోట వారి భార్యలకు ఈ సౌకర్యం కల్పించినట్లు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో ఎల్. బ్రహ్మయ్య గురువారం తెలిపారు. లబ్ధిదారులకు త్వరలో పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.