2029లో వైసీపీ జెండాను ఎగురవేయటమే మన లక్ష్యమని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. చీమకుర్తిలోని బివిఎస్ఆర్ కళ్యాణమండపం వద్ద శుక్రవారం రాత్రి వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేయగా వైసిపి కార్యకర్తలతో బూచేపల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని టిడిపి చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.